నాయకుడు తప్పు చేసినా, “కరెక్టే!” అంటావు. గుడ్డి నమ్మకంతో, దేవుడిలా అతన్ని పూజిస్తావు. నీ మేధస్సును, నీ చైతన్యాన్ని తాకట్టు పెట్టావు. గర్జించాల్సిన కంఠాన్ని, మూగగా మార్చుకున్నావు.. కానీ, దేశానికి కావాల్సింది ఈ బానిస యువత కాదు! వీరులు, విప్లవాలు పుట్టిన ఈ వీరభూమికి ఇది తగదు! మనకు కావాలి నిప్పు కణికలాంటి యువత! తప్పు ఏ నేత చేసినా.. అది సొంత నాయకుడైనా సరే.. గుండె ధైర్యంతో ఖండించే పౌరుషం కావాలి! రాజకీయాల్లోకి రావాలి.. కేవలం పదవి కోసం కాదు, ప్రక్షాళన కోసం! మార్పుకు నాంది పలకడం కోసం! అన్యాయాలను ముక్త కంఠంతో ప్రశ్నించే యుగకర్తలు కావాలి!
- సౌరం జితేందర్
- Advertisement -
