ఆస్ట్రేలియా (Australia) ఓపెన్ బ్యాటర్ (Open Batter) ట్రావిస్ హెడ్ టెస్ట్ మ్యాచ్(Test Match)ను సైతం టీ20లా ఆడి వరల్డ్ రికార్డు (World Record) నెలకొల్పాడు. 69 బాల్స్‌కే 100 రన్నులు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్(Fourth Innings)లో అత్యంత వేగంగా (Fastest) శతకం (Centuary) చేసిన ఆటగాడిగా ప్రపంచ చరిత్ర సృష్టించాడు. దీంతో.. యాషెస్ సిరీస్(Ashes Series)ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ఇంగ్లండ్(England)ను ఘోరంగా ఓడించింది. ఆ టీమ్ ఇచ్చిన 205 పరుగుల టార్గెట్‌ను కేవలం 28.2 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. ఫలితంగా.. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ రెండే రెండు రోజుల్లో ఫినిష్ అయింది.
- Advertisement -
