తెలంగాణ రాష్ట్ర(Telangana State) శాసన సభ(Assembly), శాసన మండలి(Council) సమావేశాలకు సంబంధించి గవర్నర్(Governeo) జిష్ణుదేవ్‌వర్మ (Jishnudev Varma) బుధవారం నోటిఫికేషన్ జారీ (Notification Release) చేశారు. ఈ నెల 29వ తేదీన ఉదయం పదిన్నర గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు, వాటికి నీటి కేటాయింపులు, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన ఖర్చు తదితర అన్ని అంశాలపై పూర్తిగా చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
