Tuesday, March 17, 2026
Homeఆదిలాబాద్ASHA Workers | ఆశ వర్కర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి

ASHA Workers | ఆశ వర్కర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి

నిర్మల్ జిల్లా కేంద్రం లోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఆశ కార్యకర్తల అపరిస్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ తెలుపు మేరకు 48 గంటల నిరసన దీక్షలో భాగంగా ఆశా కార్యకర్తలు ఆర్డిఓ కార్యాలయం ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించి అపరిస్తుత సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల సంఘ నాయకులు మాట్లాడుతూ ఆశ కార్యకర్తలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలనీ, ఆశా కార్యకర్తలు చాలీచాలని వేతనంతో కుటుంబాలను వెల్లదీస్తున్నారని, 18 వేల రూపాయల వేతనాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు, లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశ కార్యకర్తల ఆందోళనతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి, దీంతో పోలీసులు వాహనాలను వేరే మార్గంలో మళ్ళించారు .

- Advertisement -
RELATED ARTICLES

Latest News