మునిసిపల్ ఎన్నికల(Municipal Elections) ముందు బీజేపీ(BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్ధన్నపేట మాజీ శాసన సభ్యుడు(Former MLA from Wardhannapet) ఆరూరి రమేశ్(Aruri Ramesh) ఆ పార్టీకి సోమవారం గుడ్‌బై చెప్పారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో చేరనున్నట్లు రమేష్ ప్రకటించారు. ఈయన గత లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు బీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికల ముందు పార్టీ మారారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వస్తున్నారు. అయితే.. ఆయన కారు పార్టీలో ఎప్పుడు చేరతారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
- Advertisement -
