Friday, September 12, 2025
ePaper
spot_img
Homeసినిమాఅర్జున్ S/O వైజయంతి ఇంటెన్స్ ప్రీ-టీజర్ రిలీజ్

అర్జున్ S/O వైజయంతి ఇంటెన్స్ ప్రీ-టీజర్ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.

ఈ రోజు మూవీ ప్రీ-టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాబోయే ఇంటెన్స్ యాక్షన్, ఉత్కంఠను రుచి చూపించే అద్భుతమైన ప్రీ-టీజర్ విడుదలతో ఉత్సాహం న్యూ హైట్స్ కి చేరుకుంది. ప్రీటీజర్ లో కళ్యాణ్ రామ్ ఒక పడవపై కూర్చుని, సముద్రం వైపు చూస్తూ తన చూపులు కదలకుండా కనిపిస్తున్నారు. రక్తంతో తడిసిన అతని చొక్కా, అతని చుట్టూ ఉన్న అల్లకల్లోలాన్ని సూచిస్తుంది, పడవలు దగ్గరకు వస్తున్నప్పుడు అతని ఫెరోషియస్ లుక్ జరగబోయే పెద్ద యుద్ధాన్ని చూస్తోంది. ప్రీ-టీజర్ జరగబోయే బ్లాస్ట్ కి టోన్ సెట్ చేసింది. ఇది యాక్షన్ రోలర్ కోస్టర్‌ను అందిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన నేపథ్య సంగీతం పవర్ ఫుల్ గా వుంది. టీజర్ మార్చి 17న విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించగా, ఎడిటింగ్ తమ్మిరాజు నిర్వహించగా, స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా రాశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News