న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్(Asia Pacific Predator League : APPL)–2026 గ్రాండ్ ఫైనల్స్‌లో ముఖ్య అతిథి(Chief Guest)గా మంత్రి(Minister) మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Mandipalli Ramprasad Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇ–స్పోర్ట్స్(E-Sports) రంగం యువత(Youth)కు విస్తృత అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇ–స్పోర్ట్స్ అభివృద్ధికి దీర్ఘకాలిక దృష్టితో కార్యాచరణ ప్రణాళికను సీఎం చంద్రబాబు(CM Chandrababu) సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్ వంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు యువతకు ప్రేరణనిస్తూ భారత ఇ–స్పోర్ట్స్ సామర్థ్యాన్ని చాటుతున్నాయని అన్నారు.
- Advertisement -
