Friday, March 6, 2026
Homeకెరీర్ న్యూస్Job Mela | ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

Job Mela | ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

ఈ నెల 28న ఓయూ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆఫీసులో
100 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో, అపోలో ఫార్మసీ(Apollo Pharmacy) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరోలో ఈ జాబ్ మేళా జరగనుంది. అపోలో ఫార్మసీల్లో 100 ఫార్మాసిస్టు(Pharmacist), అసిస్టెంట్ ఫార్మసిస్ట్(Assistant Pharmacist) పోస్టులను భర్తీ చేయనున్నారు. డీ ఫారసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఏదైనీ డిగ్రీ చేసిన 18-35 ఏళ్ల యువతీయువకులు అర్హులు. ఈ మేరకు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్(UEI & GB/MCC) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైనవారికి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఇస్తారు. మరిన్ని వివరాలకు 8247656356 నంబర్‌కు కాల్ చేయొచ్చు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో వద్ద నేరుగా ఈ నెల 28న హాజరుకావాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News