Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh | ఢిల్లీలో మంత్రి లోకేష్ బిజీబిజీ

Nara Lokesh | ఢిల్లీలో మంత్రి లోకేష్ బిజీబిజీ

ఏపీ మంత్రి (AP Minister) నారా లోకేష్ ఇవాళ ఢిల్లీ(Delhi)లో బిజీబిజీ(Busy Busy)గా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను (Central Ministers) కలిశారు. హోం మంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ అయ్యారు. మొంథా తుపాను (Cyclone) కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. ఈ మేరకు నివేదికను రాష్ట్ర హోం మంత్రి అనితతో కలిసి అందజేశారు. తుపాను వల్ల 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవి అని స్పష్టం చేశారు.

వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తోనూ సమావేశమయ్యారు. తుపాను నష్టాన్ని ఆయనకు వివరించారు. సుమారు 9.53 లక్షల మంది నష్టం చవిచూశారని తెలిపారు. పంట మునిగిపోవడం, నదుల ఉద్ధృతి, సముద్ర అలల ప్రభావం వల్ల వ్యవసాయ జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, పౌర సేవా రంగాలకు భారీ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమయోచితంగా వ్యవహరించి నష్టాలను తగ్గించడంతోపాటు బాధితులకు నిరంతర సహాయాన్ని అందించిందని వివరించారు. జీఎంఆర్ (GMR) సంస్థ ఉన్నతాధికారులను కలిశారు. విశాఖ సమీపంలో దేశ తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కోసం వారిని మీట్ అయి ప్రణాళికలపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News