ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు (Investments) సాధించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు (America Tour). ఇందులో భాగంగా ఇవాళ 4వ రోజు గూగుల్ సీఈఓ(Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai), ఇంటెల్ సీటీఓ(Intel CTO), అడోబ్ సీఈఓ(Adobe CEO)తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉన్న వనరుల గురించి వివరించారు. తప్పకుండా ఏపీలో పెట్టుబడులు పెడతామని, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు.
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో శాన్‌ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ ఆర్ అండ్ డీ, ఇంజనీరింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. విశాఖపట్నంలో జీసీసీ(GCC)ని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
