ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ ,గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారంగా ఆహ్వానం పలికారు.అనంతరం ప్రధానాలయంలోని స్వయంభు మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేద ఆశీర్వచన మందపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
ఆలయ డీఈవో దోర్బల భాస్కర్ శర్మ స్వామి వారి లడ్డు ప్రసాదం,చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్యంగా మనవరాలికి అన్నప్రాసన జరిపించి మొక్కులు చెల్లించుకోవడానికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సురేంద్రాచార్యులు, అర్చకులు వినయ్, ఏఈఓ గజవెల్లి రఘు,ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఏఎస్ఐ మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
