Friday, March 27, 2026
Homeకెరీర్ న్యూస్AP | జాబ్ క్యాలెండర్ విడుదల..

AP | జాబ్ క్యాలెండర్ విడుదల..

  • నాలుగు విడతల్లో అన్నిపోస్టులకు 41 నోటిఫికేషన్స్..

ఏపీ సర్కార్ ఇటీవల మొత్తం 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాలుగు విడతల్లో అన్ని పోస్టులను 41 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. డీఎస్సీ, పోలీసు నియామకాలు మినహా మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనుంది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో గ్రూప్‌ 1 పోస్టులు 91, గ్రూప్ 2కి దాదాపు 750 వరకు పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వెనువెంటనే జారీ కానున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్‌లో సర్కార్ పేర్కొంది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 15న విడుదలకానుంది. ఈ మేరకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News