Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu | ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టంపై సమీక్ష

CM Chandrababu | ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టంపై సమీక్ష

అమరావతి(Amaravathi)లోని సచివాలయం(Secretariat)లో సీఎం చంద్రబాబు.. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌(Family Benefit Management System-FMBS)పై సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ (Real-time governance data lake) ద్వారా వివిధ సంక్షేమ పథకాలు (Welfare Schemes), ప్రభుత్వం అందిస్తున్న పలు పౌర సేవల (Civil Services) అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందించారు. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న వివరాలను సమన్వయం చేస్తూ ఎఫ్‌బీఎంఎస్‌ను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్థిక, వైద్యారోగ్యం, పౌర సరఫరాలు, పురపాలక, ఐటీ, ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News