Thursday, March 26, 2026
Homeఆంధ్రప్రదేశ్AP CM | పోలవరం పూర్తయితే ఏపీ నంబర్ వన్

AP CM | పోలవరం పూర్తయితే ఏపీ నంబర్ వన్

సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడి

సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు(Chandra Babu) సమీక్షా సమావేశం(Review Meeting) నిర్వహించారు. జీఎస్డీపీ(Gsdp), ఆర్టీజీఎస్(Rtgs), పట్టాదారు పాస్ పుస్తకాలు(Pattadar Passbooks) తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ అంశాలపై మంత్రులు(Ministers), కార్యదర్శులు(Secretaries), కలెక్టర్ల(Collectors)ను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం.
  • 2025 మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం.
  • అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగాం.
  • ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దాం.
  • తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేశాం.
  • స్త్రీశక్తి ద్వారా మహిళలు 3.5 కోట్ల ప్రయాణాలు చేశారు. దీనికోసం ఇప్పటివరకు రూ.1114 కోట్లు ఖర్చు చేశాం.
  • అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం.
  • దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికే పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2684 కోట్లు ఖర్చు చేశాం.
  • ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటం ద్వారా సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించాం.
  • 70 వరకు పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశాం.
  • అమరావతిని స్మశానం అని, ఎడారి అని ఎగతాళి చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు.
  • అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం.
  • పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు. ఇది పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.
  • ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది.
  • పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం వల్ల శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం.
  • నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉంది.
  • ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లను పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి?.
  • పోలవరంలో మిగిలిన నీళ్లను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
  • తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు.
  • రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు.
  • పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం.
  • భోగాపురం ఎయిర్ పోర్టును కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తాం.
  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.12 వేల కోట్ల సాయంతో కాపాడుకున్నాం.
  • విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. ఆ ప్లాంట్‌ను నిలబెట్టి తీరతాం.
  • దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయి.
  • పెట్టుబడులకు డెస్టినేషన్‌గా ఏపీ మారింది. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలన్నీ సాకారమైతే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి
  • ఎస్ఐపీబీ ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటి ద్వారా కూడా పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయి.
  • గూగుల్ కూడా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటుచేస్తోంది.
  • రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలో కృషి చేసిన అధికారులు, ప్రభుత్వ విభాగాలకు అభినందనలు.
  • అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేస్తాం. 6 నెలల్లో క్వాంటం కంప్యూటర్ ఇక్కడి నుంచి పనిచేస్తుంది.
  • విద్యుత్ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించగలిగాం. భవిష్యత్తులో రూ.1.19 పైసల మేర యూనిట్ కొనుగోలు ధర తగ్గించటం లక్ష్యంగా పనిచేస్తున్నాం
  • ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లలోనూ 970 టీఎంసీలను నింపగలిగాం. రాయలసీమలోనూ పెద్దఎత్తున నీటిని నిలిపాం
  • గత ఏడాది 12 శాతానికి పైగా వృద్ధి సాధించాం.
  • ఈసారి రెండో త్రైమాసికంలోనే 11.28 గ్రోత్ రేట్ సాధించాం.
  • మన లక్ష్యం 16 శాతం వృద్ధి రేటు. దానికి అనుగుణంగా పనిచేయాలి
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం తీసుకువచ్చాం
  • పౌర సేవల్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు సాధించగలిగితే 2026 మరింత మంచి ఫలితాలు సాధించవచ్చు.
  • పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో జారీ చేస్తున్నాం. గతంలో ఫొటోలు వేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారు
  • రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. అలాగే రీసర్వే ప్రక్రియను కూడా వేగంగా చేపడుతున్నాం
  • గతంలో ఎన్టీఆర్ మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ విభాగాన్ని ప్రక్షాళన చేశారు
  • 2026 ఏడాదిలో ల్యాండ్ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.
  • రిజిస్ట్రేషన్ విభాగంలోనూ పూర్తి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం
  • టెక్నాలజీని వినియోగించుకొని పూర్తి పారదర్శకంగా ఈ వ్యవస్థను మారుస్తాం
  • ప్రభుత్వ కార్యాలయాల్లో వేగంగా దస్త్రాలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
  • వీబీ జీ రామ్ జీ ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధంగా వినియోగించుకోవాలి
  • తద్వారా.. కమ్యూనిటీ ఆస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది
  • 25 ఏళ్ల క్రితమే పీపీపీ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభమైంది.
  • ఇవాళ గిన్నీస్ రికార్డును సాధించే దిశగా రహదారుల నిర్మాణం జరుగుతోంది
  • చేసిన పనులను సమర్థవంతంగా ప్రజలకు చెప్పుకోవటం ముఖ్యం
  • కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వేంకటేశ్వరస్వామిపై ప్రజలకు అంత నమ్మకం
  • అలాంటి క్షేత్రాన్ని అపవిత్రం చేసే ప్రయత్నాలు జరిగాయి. పరకామణిలో దొంగతనం జరిగితే సమర్థించే ప్రయత్నం చేశారు
  • కల్తీ నెయ్యితో ప్రసాదం తయారీ, ఖాళీ మద్యం బాటిళ్లను తిరుమలలో పెట్టడం లాంటి దుర్మార్గపు పనులకు పాల్పడ్డారు
  • దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
  • సవాళ్లను అధిగమిస్తూ 2026 అత్యుత్తమ ఏడాదిగా నిలిచేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలి.
- Advertisement -
RELATED ARTICLES

Latest News