- 2025 సివిల్స్ ఫలితాలు విడుదల..
2025 సివిల్స్ పరీక్ష ఫలితాలను ఇవాళ యూపీఎస్‌సీ రిలీజ్ చేసింది. అనూజ్ అగ్నిహోత్రి .. సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించినట్లు యూపీఎస్‌సీ పేర్కొన్నది. సుమారు 958 మంది సివిల్ సర్వీసులకు క్వాలిఫై అయినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. జనరల్ కేటగిరీలో 317, ఈడబ్ల్యూఎస్ 104, ఓబీసీ 306,ఎస్సీ 158, ఎస్టీ 73 మంది సివిల్స్ సాధించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన ప్రకటనలో పేర్కొన్నది. టాప్ టెన్ ర్యాంకర్లలో అనూజ్ అగ్నిహోత్రి, రాజేశ్వరి సువి, ఆకాన్ష్ దూల్, రాఘవ్ జున్‌జున్‌వాలా, ఇషాన్ భట్నాగర్, జిన్యా అరోరా, ఏఆర్ రాజా మోహిద్దిన్, పక్షల్ సెక్రట్రీ, ఆస్తా జైన్, ఉజ్వల్ ప్రియాంక్ ఉన్నారు.
- Advertisement -
