- ప్రభుత్వం దృష్టిని ఏమార్చి అమాయకులను మోసం చేస్తున్న వైనం
- మణికొండ మున్సిపాలిటీలో వెలుగు చూసిన దుర్మార్గం..
- మోసాలకు తెరలేపిన అనూహర్ హోమ్స్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్
- రెసిడెన్షియల్ ప్లాట్స్ కమర్షియల్ అంటూ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందడం విచిత్రం..
- సంబంధిత అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను జారీ చేయడంపై అనుమానాలు
- ఈ కట్టడం అక్రమమని తేల్చి కూల్చేసిన మున్సిపల్ అధికారులు..

మణికొండలోని అనుహర్ హోమ్స్ మార్నింగ్ రాగా, ఆల్కాపూర్ టౌన్‌షిప్‌లో మాండవ సాయి కిరణ్ అనే వ్యక్తి షట్టర్స్ కొనుగోలు చేయడం జరిగింది.. షట్టర్స్ కొనుగోలు సమయంలో, ఆ యూనిట్లు వాణిజ్య అంటే కమర్షియల్ యూనిట్లుగా ఉంటాయని బిల్డర్ అతనికి చెబుతూ హామీ ఇవ్వడం జరిగింది..అందుకు గాను ప్రతి చదరపు అడుగుకు రూ. 9,500 చొప్పున బిల్డర్ చార్జ్ చేశారు.. అయితే తెల్ల కాగితంపై కేవలం రూ. 6,500 మాత్రమే చూపించారు. అదే సమయంలో, అదే ప్రాజెక్ట్‌లోని నివాస యూనిట్ల ధర కేవలం రూ. 4,100 మాత్రమే ఉండటం గమనార్హం..కాగా సదరు బిల్డర్ నివాస యూనిట్లను.. కమర్షియల్ యూనిట్లుగా తప్పుగా చూపించి అధిక ధరకు అమ్మడం వలన బాధితుడికి భారీ ఆర్థిక నష్టం కలిగింది.
ఆ తరువాత మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్‌లు కలిసి 27 నవంబర్ 2024న ఆ ప్రాంతాన్ని పరిశీలించారు..అక్కడ నిర్మించిన యూనిట్లు నిజంగా నివాస యూనిట్లేనని ధృవీకరించారు. తరువాత, వారు బాధితుడైన సాయికిరణ్ కొనుగోలు చేసిన యూనిట్‌లో ఏర్పాటు చేసిన షట్టర్స్‌ను తొలగించేశారు. ఈ క్రమంలో ఆ యూనిట్‌లోని అంతర్గత వస్తువులు, విలువైన వస్తువులు సుమారుగా రూ.50 లక్షల వరకు నష్టానికి గురి అయ్యాయి.. కాగా అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ కూల్చివేతలు జరిపారు.. అయితే వారు నోటీసులు బిల్డర్ అయిన ఎన్. రామిరెడ్డికి ఇచ్చినట్లు తెలిసింది.. కానీ సదరు బిల్డర్ రామిరెడ్డి బాధితుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.. ఈ పరిణామంతో బాధితుడి జీవితం అస్తవ్యస్తం అయ్యింది.. అతని కుటుంబం రోడ్డున పడింది.. అతనికి జరిగిన నష్టం కోట్లలో ఉన్నట్టు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు..
అసలు జరిగిన వ్యవహారం సంక్షిప్తంగా చూస్తే మాండవ సాయి కిరణ్.. అతని సోదరి కలిసి 25 జూన్ 2022 నాడు జీ 4, జీ 5 అనే షట్టర్స్ ను భాగస్వామ్యంగా కొనుగోలు చేశారు.. బిల్డర్ ఇచ్చిన హామీ ప్రకారం వాణిజ్య యూనిట్లు అనుకుంటూ గుడ్డిగా నమ్మి కొనుగోలు చేశారు..కాగా హెచ్.ఎం.డీ.ఏ., మున్సిపల్ అధికారుల ద్వారా సదరు బిల్డర్‌కి వాణిజ్య యూనిట్ల సర్టిఫికేషన్ చూపించమని నోటీసులు ఇచ్చారు. కానీ బిల్డర్ తగిన ఆధారాలు చూపించలేదు.. దీనితో బాధితులు కొనుగోలు చేసిన యూనిట్లు వాస్తవానికి నివాస యూనిట్లు అని అర్థమైంది. ఈ విషయంపై బిల్డర్‌తో మాట్లాడినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.. ఇక 16 డిసెంబర్ 2024న యూనిట్ డిమోలిషన్ జరిగింది. బిల్డర్ సమస్య పరిష్కారం చేయకుండా, తన కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించారని బాధితుడు ఆరోపించారు.. అయితే అనుహర్ కన్స్ట్రక్షన్ సేల్స్ హెడ్ నాగేంద్ర బెదిరింపులకు దిగుతూ మావెనుక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు..మాకు ధనబలం వుంది..మీరేమీ చేయలేరని బెదిరించడం జరిగింది..
కనుక ఈ వ్యవహారంలో రేరా, హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు నిబంధనల ప్రకారం తనకు న్యాయం చేసి, తగిన చర్యలు తీసుకుని తన కుటుంబాన్ని రక్షించాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.. తక్షణమే అనుహర్ కన్స్ట్రక్షన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.. నివాస యూనిట్లను వాణిజ్య యూనిట్లుగా తప్పుగా చూపించడం కారణంగా అధికారులు స్పందించాలి.. తనకు జరిగిన నష్టానికి బిల్డర్ నుంచి పరిహారం ఇప్పించాలి.. అదే విధంగా యూనిట్ ధర తేడా గుర్తించి అది కూడా తిరిగి ఇప్పించాలి.. రేరా, హెచ్.ఎం.డీ.ఏ. చట్టాల ప్రకారం తగిన న్యాయం చేయాలి.. ఇక జీ 4, జీ 5 షట్టర్స్ కి బిల్డర్ నుంచి ఒక సంవత్సరానికి అద్దెను ఇప్పించాలి.. జరిగిన నష్టానికి పరిహారం వడ్డీతో సహా ఇప్పించాలి..కాగా తాము షట్టర్స్ కొనుగోలు చేస్తున్న సమయంలో కమర్షియల్‌గా ఉపయోగించుకోవడంపై ఎలాంటి సమస్య రాదనీ బిల్డర్ హామీ ఇచ్చాడని, సేల్ అగ్రిమెంట్ పాయింట్ 14 ప్రకారం, నో అబ్జక్షన్ అంటూ తమని మోసం చేశాడని బాధితులు పేర్కొన్నారు.. తనకు తగిన న్యాయం జరగపోతే ఆదాబ్ సహకారంతో న్యాయపోరాటానికి సిద్ధం అవుతానని బాధితుడు తెలియజేశాడు..

