Tuesday, March 3, 2026
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu | ఐదేళ్ల జగన్‌ పాలనలో సర్వనాశనం

Chandrababu Naidu | ఐదేళ్ల జగన్‌ పాలనలో సర్వనాశనం

వ్యవస్థలను దెబ్బతీసిన వైకాపా పాలన కొన్ని కంపెనీలు రాష్ట్రాన్ని వీడాయి ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ పూర్తిగా దెబ్బతింది ఒక్కో రంగాన్ని గాడిన పెడుతూ వస్తున్నాం ఆర్థిక నివేదిక విడుదల చేసిన చంద్రబాబు

వైకాపా ఐదేళ్ల పాలనలోఅభివృద్ధి ఆగిపోవడమే గాకుండా ఎపి బ్రాండ్‌ పూర్తిగా దెబ్బతిందని, ఆదాయం తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని రంగాలు పూర్తిగా ధ్వసం అయ్యాయని, వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. వైకాపా పాలన దెబ్బకు ఆంధప్రదేశ్‌ బ్రాండ్‌ దెబ్బతిన్నది. ఆ పార్టీ చేసిన దారుణాల వల్ల కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ఇప్పుడు అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ అభివృద్ధి కొనసాగిస్తున్నాం అని వివరించారు. విధ్వంసమైన ఆంధప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

- Advertisement -

సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అనేక విజయాలను చవిచూసిందని.. కానీ 2024 విజయం.. నమ్మకం, విశ్వాసం మీద వచ్చిందని తెలిపారు. సూపర్‌ సిక్స్‌ను సూపర్‌ హిట్‌ చేశామన్నారు. పరీక్ష రాసినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్‌గా ఉంటారో తాము అంతే టెన్షన్‌గా ఉంటామని చెప్పుకొచ్చారు. జీఎస్డీపీ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని తెలిపారు.ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టగలు గుతారా? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని.. అయితే ప్రస్తుత పరిస్థితి చూసి పారిపోమని ప్రజలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.ప్రస్తుతం ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ..

ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడిరదని, కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని అన్నారు. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం గతంలో రూ.9వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు విద్యుత్‌ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్‌ రంగాన్ని సమర్థంగా నిలబెడుతున్నాం అని అన్నారు. వచ్చే ఏడాది కూడా విద్యుత్‌ రంగంలో సమర్థత పెంచుకుంటాం. సాగు నీటి పంట గుంటలు తవ్వడంతోపాటు, చెక్‌ డ్యామ్‌లు కట్టాం. ఇంగ్లీష్‌ మీడియం పేరుతో విద్యా వ్యవస్థలో కూడా గతంలో డ్రామాలు చేశారు.

విద్యా వ్యవస్థలోని బిల్లులు అన్నీ పెండిరగ్‌లో పెట్టారు. వైకాపా ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని చంద్రబాబు దుయ్యబట్టారు.ప్రతి తైమ్రాసిక, ఆర్థిక ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తి పర్యవేక్షిస్తున్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకొని అభివృద్ధి చేస్తాం. ఆస్తులు, భవిష్యత్‌ ఆదాయాన్ని తాకట్టు పెట్టి గతంలో అప్పులు తెచ్చారు. మూలధన వ్యయం చేయకపోవడంతో గతంలో ప్రాజెక్టులు ముందుకెళ్లలేదు. కూటమి అధికారంలోకి వచ్చాకే స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూలధన వ్యయం పెంచి ప్రాజెక్టులు చేపట్టాం. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజల చేతుల్లోకి పాలన తీసుకెళ్లాం. వైకాపా హయాంలో పీపీఏల రద్దుతో విద్యుత్‌ వాడకుండానే రూ.9 వేల కోట్లు వ్యయం చేశారు.

కక్షపూరిత రాజకీయాలతో గత పాలకు ప్రజాధనాన్ని వృథా చేశారు. 201419 మధ్య 13.5 శాతంగా వృద్ధిరేటు ఉండేది. 201924 మధ్య కాలంలో అది 10.32 శాతానికి పడిపోయింది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తెచ్చాం. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. నాడు సూపర్‌ సిక్స్‌ తీసుకువచ్చామని… అయితే అభివృద్ధికి నిధులు లేవన్నారు. క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ బాగా తగ్గి అభివృద్ధి లేకుండా పోయిందని వెల్లడిరచారు. తరువాత అన్ని వ్యవస్థలను గాడిన పెట్టామన్నారు. క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ను బాగా పెంచామని.. సుపరిపాలనకు టెక్నాలజీని అభివృద్ధి చేశామని అన్నారు. ఆగిపోయిన స్కీంలు అన్నింటినీ తిరిగి ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండిరటినీ సమపాళ్లలో చేపట్టామన్నారు.

18 నెలలుగా ప్రతి గంట, ప్రతి క్షణం కష్టపడ్డామన్నారు. 93 స్కీంలను మరలా రివైవ్‌ చేసినట్లు తెలిపారు. రూ.9000 కోట్ల సోలార్‌ విండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ కింద నాటి ప్రభుత్వం డబ్బులు పెంచేసిందని విమర్శించారు. కరెంటు ఛార్జీలు పెంచకుండా వ్యవస్థను నిలబెట్టామన్నారు. కరెంటు ఛార్జీలు ఈ ఏడాది కూడా పెంచమని… వచ్చే ఏడాది పెంచుకుంటామని సీఎం వెల్లడిరచారు. రాష్ట్రంలో చాలా చోట్ల గ్రౌండ్‌ వాటర్‌ పెంచగలిగామన్నారు. ఏపీ బ్రాండ్‌ రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్నదని.. పరిశ్రమలను వెళ్లగొట్టారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో ఆంగ్ల మీడియం అని చెప్పి డ్రాపవుట్లను పెంచారన్నారు. ఆలిండియా లెవల్‌లో టాప్‌ ్గªవ్‌ ఉన్న ఎడ్యూకేషన్‌ సిస్టంను టాప్‌ త్రీ లేదా వన్‌కు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

భూగర్భ జలాలను పెంచడం కూడా చేశామన్నారు. ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పెట్టుబడుల గురించి అందరికీ తెలిసిందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయం ఎలా పెరిగిందో చూస్తే రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని అర్థమవుతోందన్నారు. ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియాలనే ఉద్దేశంతో అన్నీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అయిదేళ్లు అధికారంలో ఉందన్నారు. ఇక్కడ సరాసరి జీఎస్టీ 13.5 శాతం సాధించామని… కేంద్ర జీఎస్డీపీ కన్నా ఎక్కవ సాధించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 12.02 శాతం వృద్ధి సాధించామని….

ఆల్‌ ఇండియా లెవల్‌లో 9.8 శాతంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా.. 202526 తొలి అర్థ సంవత్సరం అలాగే 2వ తైమ్రాసికం ఫలితాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. స్థిర ధరల వద్ద నమోదైన ఆర్ధిక వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, గ్రాస్‌ వాల్యూ అడిషన్‌, వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలు నమోదు చేసిన వృద్ధి గణాంకాలను విడుదల చేశారు. విభజన వల్ల రాష్టాన్రికి వ్యవస్థీకృతమైన నష్టం జరిగిందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. 201924 పాలన వల్ల వ్యవస్థలు డీఫంక్ట్‌ అయ్యాయని… రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని తెలిపారు.

గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్‌ రేట్‌ తగ్గి రూ.7లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పో యామని వెల్లడిరచారు. గ్రోత్‌ రేట్‌ లేకపోవటం వల్ల రూ. 76,195 కోట్ల ఆదాయం కోల్పోయా మన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోందని చెప్పారు. రుణాల రీ`షెడ్యూలింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బ్రాండ్‌ తగ్గినప్పుడు వడ్డీ రేటు పెరిగిపోతుందని… తద్వారా రెవెన్యూ జీఎస్డీపీలో రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. 25 ఏళ్ల క్రితం చేసిన ఐటీ పాలసీ వల్ల తెలుగు వాళ్ల తలసరి అదాయం గరిష్టస్థాయిలో ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్నదే ఎప్పుడూ తన ఆలోచన అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News