Tuesday, March 3, 2026
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan | ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం

Pawan Kalyan | ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని రక్త గాయం నుంచి పుట్టిన వృక్ష సంపదను కాపాడుకుందాం
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘ఎర్రచందనం (Red Sandalwood) అనేది శేషాచలం అడవుల్లో (Seshachalam Forests) తప్ప ప్రపంచం(World)లో ఎక్కడా దొరకని అపురూపమైన అటవీ సంపద. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి (Srivenkateswara Swami) గాయం అయినప్పుడు ఆయన రక్తం(Blood)తో ఉద్భవించిన వృక్షంగా ఎర్రచందనాన్ని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ అపురూప సంపద శేషాచలంలో తప్ప మరెక్కడా ఇంత నాణ్యతతో ఉండదు. ఇది హిందువుల (Hindu) మనోభావాలతో, వారి నమ్మకాలతో ముడిపడి ఉన్న గొప్ప వృక్ష సంపద. దీన్ని కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత’ అని డిప్యూటీ సీఎం(Deputy Cm), అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎర్ర చందనం అక్రమంగా (Illegal) రవాణా చేసే వారంతా ఆపకపోతే సంవత్సరంలోగా ప్రత్యేక ఆపరేషన్ (Special Operation) ద్వారా ఏరివేస్తామని హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, అవకాశాలు, అవరోధాలపై చర్చించేందుకు ఆయన ఐదు జిల్లాల ఎస్పీలు, రెడ్ శాండల్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులతో శనివారం తిరుపతి కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News