Wednesday, March 4, 2026
Homeఅంతర్జాతీయంAmerica | ఎంబసీ, కాన్సులేట్లు క్లోజ్

America | ఎంబసీ, కాన్సులేట్లు క్లోజ్

ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం(US Embassy), కాన్సులేట్లు(Consulates) ఈ నెల 24 నుంచి 26 వరకు మూసివేస్తున్నారు. ఫెడరల్ విభాగాలను, ఏజెన్సీలను మూసివేయాలని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు(USA President) కార్యనిర్వాహక ఉత్తర్వులను విడుదల చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికితోడు డిసెంబర్ 25న క్రిస్మస్(Christmas) రోజు సెలవు కారణంగా మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయం అవసరమైన అమెరికా పౌరులు రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లలోని ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ల(Emergency Contact Numbers)ను ఉపయోగించాలని సూచించింది. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతాలోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్ ఆఫీసులను 3 రోజులు క్లోజ్ చేసి ఉంచుతారు.

ఈ 3 రోజుల్లో వీసా ఇంటర్వ్యూలు, పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ సహా సాధారణ కాన్సులర్ సేవలు నిలిచిపోయాయి. ఈ సేవలు తిరిగి డిసెంబర్ 29న(సోమవారం) ప్రారంభమవుతాయి. షెడ్యూల్ చేసిన అపాయింట్‌మెంట్‌లు ఉన్న దరఖాస్తుదారులు రీషెడ్యూల్ కోసం సంప్రదించవచ్చు. తదనుగుణంగా సందర్శనలను ప్లాన్ చేసుకోవాలి. సెలవుల తర్వాత ఎక్కువ అపాయింట్‌మెంట్లు ఉంటాయి కాబట్టి డిసెంబర్ 29 వరకు కాన్సులేట్‌లకు వెళ్లకుండా ఉండటం బెటర్ అని సూచించింది. రెన్యువల్స్‌కి సంబంధించిన అప్‌డేట్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లు లేదా ఇ-మెయిల్స్‌ను చెక్ చేయొచ్చు. ఆఫీసుల మూసివేత సమయంలో వాక్-ఇన్‌లు లేదా సాధారణ ప్రశ్నలకు సమాధానాలు లభించవు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News