- ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన అమీనా పూర్ ప్లాట్ల నివాసితులు..
అమీనాపూర్ లో 30 సంవత్సరాల క్రితం కొనుగోలు సమయంలో పెద్ద చెరువు చాలా దూరంలో ఉండేదని, వ్యర్థాలతో పరిసర ప్రాంతాల మురుగు నీటితో నిండిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి అన్నారు. అమీనాపూర్ ప్లాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
1998 లో 93 ఎకరాలలో ఉన్న పెద్ద చెరువు, చుట్టూ పక్కల ఉన్న ఫ్యాక్టరీ వ్యర్థాలతో, పరిసర ప్రాంతాలలో ఉన్న జనావాస వ్యర్థాలతో ( డ్రైనేజ్) నిండి, చెరువు సుందరీకరించడంతో స్లూయిస్లు (నీటి నియంత్రణ ద్వారాలు) పనిచేయకుండా ఆగిపోయాయి. ఇందు మూలంగా 470 ఎకరాలకు విస్తరించిందని అన్నారు.

డ్రైనేజ్ ప్రవాహాన్ని అరికట్టడానికి, తూము, అలుగు ద్వారా నీటిని పంపడానికి నీటిపారుదల, రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులకు అభ్యర్థన పెట్టుకున్నారని తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంతో హైడ్రా అధికారులకు గ్రామ పటం, ఎన్ ఆర్ ఎస్ ఏ పటాలను టోపో షీట్లను సమర్పించి అభ్యర్థించారని వారు పట్టించుకోక పోవడంతో, బాదితులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్య చేరే వేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కి అభ్యర్థన తో కూడిన పత్రాన్ని మీడియా సమావేశంలో అందచేశారు.
అమీనాపూర్ ప్లాట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వర్ణశ్రీ మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యను సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి పెద్ద చెరువు నీటి ముంపు నుండి వారి ప్లాట్స్ ను బయటపడేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబెర్స్ ప్రమీల, సాంబయ్య, సత్యనారాయణ, కేవీ గోపాల్, ప్రసాద్, సాగర్, భాను, సీత రామరాజు, ప్రశాంతి, వెంకటేశ్వరరావు, వాణి, కరుణ తదితరులు పాల్గొన్నారు.
