Thursday, March 26, 2026
Homeమెదక్‌Amberpet Sai Yadav | అమ్మవారి రుణం తీర్చుకుంటా

Amberpet Sai Yadav | అమ్మవారి రుణం తీర్చుకుంటా

  • అంబర్పేట్ సాయి యాదవ్
  • కొండపోచమ్మ సన్నిధిలో కుటుంబ సమేతంగా

కొండపోచమ్మ అమ్మవారి రుణం తీర్చుకునే భాగ్యం తనకు కలిగిందని తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని అంబర్పేట్ సాయి యాదవ్ అన్నారు. బుధవారం రోజున జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ లోని కొండపోచమ్మ అమ్మవారిని వారి కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోరికలు తీర్చాలని రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అమ్మవారి సన్నిధి ఎదుట తనవంతు సహాయంగా గుడి ప్రాంగణం ఎదుట భక్తుల కొరకు రేకులతో షెడ్డును ఏర్పాటు చేయిస్తానని అన్నారు. అమ్మవారికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు అమ్మకు రుణపడి ఉంటానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News