Wednesday, May 6, 2026
Homeస్పోర్ట్స్Rayudu | హైదరాబాద్ క్రికెట్ కు సేవ చేయడం నా అదృష్టం..

Rayudu | హైదరాబాద్ క్రికెట్ కు సేవ చేయడం నా అదృష్టం..

  • వెల్లడించిన అంబటి రాయుడు..
  • హైదరాబాద్ క్రికెట్ ను గాడిలో పెడతాను..

హైదరాబాద్‌ క్రికెట్‌ను గాడిలో పెట్టేందుకు టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ముందుకొచ్చాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌గా నియమితుడైన రాయుడు మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించాడు. మూడేళ్ల్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న రాయుడు ఇకపై హెచ్‌సీఏలో క్రికెట్‌కు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించనున్నాడు.

అన్నింటా పారదర్శకత, ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యత అనే విధానంతో హైదరాబాద్‌ను దేశవాళీ క్రికెట్‌లో పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని అంబటి పేర్కొన్నాడు. ఇందుకోసం క్రికెట్‌ ఆపరేషన్స్‌ను ఆటోమేట్‌ చేయనున్నట్లు, ముంబై క్రికెట్‌ సంఘం తరహాలోనే ఆధునిక ప్లేయర్‌ కాంట్రాక్ట్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపాడు.

- Advertisement -

‘నేను పుట్టి పెరిగిన హైదరాబాద్‌ క్రికెట్‌కు సేవ చేసే అవకాశం రావడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నేను 13 ఏళ్ల వయసులో ఓపెన్‌ ట్రయల్స్‌ ద్వారానే ఎంపికయ్యాను. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించడానికి మళ్లీ ఓపెన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తాం. బెంగళూరు తరహాలోహైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్త్తాను.

హైదరాబాద్‌, తెలంగాణలో ఎంతో క్రికెట్‌ నైపుణ్యం ఉంది. మన రాష్ట్రం నుంచి మరింత మంది క్రికెటర్లను దేశానికి అందించే బాధ్యతను ఉత్సాహంగా స్వీకరిసున్నా. హైదరాబాద్‌ జట్లను విజయపథంలో నడిపి అన్ని విభాగాల్లో ట్రోఫీలు నెగ్గేలా చేయడమే నా అంతిమ లక్ష్యం’అని రాయుడు పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News