Saturday, March 7, 2026
Homeజాతీయంవిమానాశ్రయాల భద్రతపై హైఅలర్ట్‌

విమానాశ్రయాల భద్రతపై హైఅలర్ట్‌

ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు

దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఉగ్రవాద, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా అన్ని విమానాశ్ర‌యాల‌కు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఈ దాడులు జరగొచ్చని హెచ్చరిక రావడంతో అన్ని ఎయిర్‌పోర్టులలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తి లేదా వస్తువు కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. భద్రతా కారణాల వల్ల తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని, ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News