బ్లాక్‌బస్టర్ సక్సెస్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి'(Alias Rukmini) అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ‘అలియాస్ రుక్మిణి'(Alias Rukmini) ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమాలో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘రుక్కురుక్కు రుక్మిణి’ పాటను అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఫార్మల్ డ్రెస్‌లో నితిన్ కూల్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తే, సంప్రదాయ చీరకట్టులో ఆఫియా సయ్యద్ అందంగా మెరిశారు. హీరోహీరోయిన్ల లుక్, పోస్టర్‌లోని విజువల్స్ సాంగ్‌పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్సీ డీవోపీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్.
ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
తారాగణం: నితిన్, ఆఫియా సయ్యద్, సాయికుమార్, హర్షవర్ధన్.
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీ కాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ T. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గర్రపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్
