Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Alakunta Hari | విచారణ పేరుతో కెసిఆర్ ను వేధిస్తే ఊరుకోం

Alakunta Hari | విచారణ పేరుతో కెసిఆర్ ను వేధిస్తే ఊరుకోం

  • ఆలకుంట హరి
  • తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ గుర్తుచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మలిదశ తెలంగాణ ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిట్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ గ్రేటర్ యువజన విభాగం అధ్యక్షుడు ఆలకుంట హరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో తార్నాక డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి హరి నివాసంలో కెసిఆర్ కు మద్దతుగా వెళ్లకుండా హరి ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్లకుండా గృహనిర్బంధం చేశారు.

ఆలకుంట హరి మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు లేకుండా, బారాస శ్రేణులను ఉద్యమకారులను ఈ విధంగా నిర్బంధించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి నిర్బంధాలు,అరెస్టులు ఎన్నో చూశామని,కానీ నేడు అదే ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో మళ్లీ అలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరమని వారు వ్యాఖ్యానించారు.

- Advertisement -

రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తెలంగాణ ప్రజలను మరోసారి ఉద్యమ జ్ఞాపకాల్లోకి నెట్టుతున్నాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్యమకారులను నిర్బంధించిన మాత్రాన ప్రజాపాలన అసమర్ధపు ప్రభుత్వ వైఖరిపై రెట్టింపైన పోరాటాలతో భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

కేసీఆర్ మీద రాజకీయ కక్షతో ఈగ వాలితేనే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసుకోవాలని హెచ్చరించారు.మీరు ఎన్ని సిట్ లు వేసినా,ఎన్ని విచారణలు జరిపినప్పటికీ చివరకు దొరికేది గుండు సున్న తప్ప ఏమీ ఉండదని బీఆర్‌ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి.ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలను మానుకొని,తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News