రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు అనగా తేదీ:03.01.2026, మంగళవారం రోజున ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల నుండి ఐదుగురు అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకోవటం జరిగింది. 2వ వార్డు నుండి మోతే వెంకటమ్మ, మరియు పర్రెలక్ష్మి, మూడో వార్డు నుండి cpm నుండి మోరిగాడి రమేష్ ,6వ వార్డు నుండి రాయపురం భాస్కర్, 9వ వార్డు నుండి సుక్క చంద్రయ్య,మరియు కొనపురం నాగరాజు, వారి యొక్క అభ్యర్థిత్వన్ని ఉపసంహరించుకోవడం జరిగింది.
ఈరోజు వరకు 40 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ కృష్ణా రెడ్డి,సహాయ జిల్లా ఎన్నికల అధికారి మరియు కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి,రిటర్నింగ్ ఆఫీసర్లు వి ఆంజనేయులు, ఎం.సత్యాంజనేయ ప్రసాద్, పి.అనురాధ, హేమంత్ కుమార్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు వెంకటేష్, ఏం.తిరుపతి రెడ్డి, కే.ఉమా శంకర్, ఎస్. సత్తిరెడ్డి మరియు సిహెచ్. ఉదయ్ కుమార్ మున్సిపల్ మేనేజర్ బి.జగన్ మోహన్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
