Thursday, March 5, 2026
Homeమెదక్‌Sheelampalli | అంగన్వాడీలో అక్షరాభ్యాసం

Sheelampalli | అంగన్వాడీలో అక్షరాభ్యాసం

పిల్లల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు
శీలంపల్లి సర్పంచ్ రాజేందర్ రెడ్డి వెల్లడి

చిలిపిచేడ్ మండలం శీలంపల్లి అంగన్వాడీ(Anganwadi)లో శుక్రవారం వసంత పంచమి(Vasantha Panchami) సందర్భంగా అక్షరాభ్యాసం(Aksharabhyasam) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలే పిల్లలకు అక్షరాలు నేర్పే తొలి బడి అని, ఇక్కడే వారి బంగారు భవిష్యత్తు(Golden Future)కు బాటలు పడతాయని చెప్పారు. ప్రభుత్వం అందించే బలవర్ధకమైన ఆహారం పిల్లల శారీరక ఎదుగుదలకు ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం.. ప్రాథమిక పాఠశాలలో రాజేందర్ రెడ్డికి సన్మానం (Fecilitation) చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిష్టారెడ్డి, కార్యదర్శి అఖిల్, స్కూల్ టీచర్లు రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్ స్వరూప, పాఠశాల చైర్మన్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News