Sunday, February 22, 2026
HomeసినిమాViral | అక్కినేని నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడా ..?

Viral | అక్కినేని నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడా ..?

అక్కినేని నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య భార్య శోభితా ధూళిపాళ్ల లేదా అఖిల్ భార్య జైనబ్ ప్రెగ్నెంట్ అనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను నాగార్జున స్వయంగా ఖండించారు. ఓ హెల్త్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన,ఇలాంటి శుభవార్తలు ఏవైనా ఉంటే నేనే అధికారికంగా ప్రకటిస్తాను అని స్పష్టం చేశారు. దీంతో అక్కినేని కోడళ్లు ఎవ్వరూ ప్రస్తుతం గర్భవతులు కాదని క్లారిటీ వచ్చింది.

ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని తేలింది.ఇక పెళ్లి తర్వాత నాగచైతన్య, శోభిత ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా మారారు. ఇటీవలే హానీమూన్ ట్రిప్‌కి వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ శోభిత ప్రెగ్నెంట్ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ఇటీవల కనిపించిన ఫొటోలు చూసిన నెటిజన్లు ‘ అక్కినేనీ బుల్లి వారసుడు రాబోతున్నాడా?’ అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రూమర్స్ రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై నాగచైతన్య గానీ, శోభిత గానీ అధికారికంగా స్పందించలేదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News