- చరిత్ర పాఠాల నుంచి ప్రేరణ పొందాలి..
- మన స్వాతంత్య్ర యోధుల ధీరత్వం పుణికి పుచ్చుకోవాలి..
- వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో అజిత్ ధోవల్
మన దేశ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని యువతకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దబోల్ సూచించారు. ప్రతీకారం మంచిది కాదని.. దానిని ప్రేరణ శక్తిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం మన సరిహద్దుల వద్దే కాకుండా.. దేశంపై గతంలో జరిగిన అణచివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని అన్నారు. ఇందుకోసం దేశ సైనిక, ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల ధీరత్వాన్ని పుణికి పుచ్చుకోవాలన్నారు. చరిత్రలో ఇతర దేశాలు మనపై దాడులు చేసి ఆలయాలు, గ్రామాలను ధ్వంసం చేసినప్పటికీ మన పూర్వీకులు మాత్రం ఏ దేశ ప్రజలకూ ఎటువంటి హాని చేయలేదని అజిత్ డోభాల్ పేర్కొన్నారు.
వారి నుంచి పాఠాలు నేర్చుకొని మనం కూడా ఇతరులను ఇబ్బందిపెట్టకుండా ప్రగతిశీల సమాజం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఏ దేశమైనా అభివృద్ధి బాటలో నడవాలంటే సరైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారంనాడు జరిగిన ’వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి అజిత్ డోభాల్ మాట్లాడారు. నాయకత్వం గొప్పదనాన్ని తెలుపుతూ..
‘ఒక గొర్రె నేతృత్వంలోని వెయ్యి సింహాలకు భయపడను.. కానీ సింహం నేతృత్వంలోని వెయ్యి గొర్రెలకు భయపడతాను‘ అని ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ అన్న మాటలను గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కేవలం పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపిందన్నారు. మరికొన్నేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల వరుసలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం వంటి విషయాల్లో ప్రధాని మోదీ నిబద్ధత, కృషి, నాయకత్వ భావాలు, అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మీరు అదృష్టవంతులు, ఇండిపెండెంట్ ఇండియాలో మీరు పుట్టారు. భారతదేశం వలసవాదుల గుప్పిట్లో ఉన్నప్పుడు నేను పుట్టాను’ అని 81 ఏళ్ల డోభాల్ అన్నారు. దేశవ్యాప్తంగా 3,000 మంది యువ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగత్‌సింగ్‌ను ఉరి తీశారని, సుభాష్ చంద్రబోస్ తన జీవితాంతం కష్టపడ్డారని, స్వాతంత్య్ర సముపార్జన కోసం మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేశారని డోభాల్ అన్నారు.
ప్రపంచంలో జరిగిన దాడులు, యుద్దాలకు కొన్ని దేశాలు తమ ఇష్టారీతిగా బలప్రయోగానికి దిగడమే కారణమని అన్నారు. ‘మీరు శక్తిమంతులైతేనే స్వేచ్ఛగా మనగలుగుతారు. ఆత్మవిశ్వాసం లేకుండా ఎంత శక్తి ఉన్నా, ఆయుధ సంపత్తి ఉన్నా వృథా. అలాంటి గొప్ప నాయకులు మనకు ఉండటం మనం చేసుకున్న అదృష్టం’ అని డోభాల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఆయన పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ మన అందరికీ స్ఫూర్తి అని డోభాల్ అన్నారు. నాయకత్వం గొప్పతనాన్ని వివరిస్తూ నెపోలియన్ అన్న మాటలను ఆయన గుర్తుచేశారు.
ఒక గొర్రె నేతృత్వంలోని వెయ్యి సింహాలకు కూడా తాను భయపడనని, కానీ ఒక సింహం నాయకత్వంలోని వెయ్యి గొర్రెలకు భయపడతానని నెపోలియన్ చెప్పేవారని అన్నారు. మనది ప్రగతిశీల సమాజమని, మనం ఇతరుల నాగరికత, ఆలయాలపై దాడులు చేయమని అన్నారు. భారతదేశంపై గతంలో జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, ఈ దాడుల్లో లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు.
చరిత్ర మనకు సవాళ్లు విసురుతోందన్నారు. అయితే ఇందుకు తగిన ఫైర్ ఇవాల్టి యువతలో ఉందన్నారు. ప్రతీకారం అనేది మంచి పదం కానప్పటికీ, అది శక్తిమంతమైనదని అన్నారు. దేశం కోసం మనం ప్రతీకారం తీర్చుకోవాలి, అందుకోసం విలువలతో కూడిన సమున్నత భారతదేశాన్ని పునర్నిర్మించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
