- ఏఐఎస్ఎఫ్ డిమాండ్
- కలెక్టర్‌ను కలిసిన ఏఐఎస్ఎఫ్ నేతలు
సీతాఫల్మండిలో విద్యాలయాళ నూతన భవన నిర్మాణాలు ప్రారంభ దశలోనే నిలిచిపోయిన నిర్మాణానికి కేటాయించిన రూ.30 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు త్వరలోనే నిర్మాణ స్థలాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు.ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్,కార్యదర్శి చైతన్య యాదవ్ మాట్లాడుతూ…

నిధుల విడుదలలో జాప్యం కారణంగా భవన నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాల సదుపాయం లేకపోవడంతో పేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదవలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పేద వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులతో చర్చించి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కలెక్టర్‌ను కలిసిన వారిలో ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు ఉప్పాల ఉదయ్ కుమార్,భాను జోసెఫ్, రఘు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
