AI సైబర్‌కాన్ సమ్మిట్(AI CyberCon Summit) హైదరాబాద్ హైటెక్ సిటీలోని టి-హబ్(T-Hub)లో విజయవంతంగా జరిగింది. దేశంలోని వివిధ పరిశ్రమలకు చెందిన 300 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా AI, IT, సైబర్ సెక్యూరిటీ, BFSI, ఫిన్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, స్టార్టప్‌లు, ప్రభుత్వ రంగాలకు చెందినవారు కావటం గమనార్హం. ఆర్ఎస్‌వీ బద్రీనాథ్(మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్సైజ్, తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్, తెలంగాణ) & సెక్రటరీ జనరల్ U-FERWAS, CoRWA, FGCC,TeNa) పాల్గొన్నారు. ప్రపంచ AI, డిజిటల్ భద్రతా పర్యావరణ వ్యవస్థలో పెరుగుతున్న మన దేశ పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
ఈ సమ్మిట్‌ను ఫౌండర్స్ క్లబ్ ఇండియా(FCI), తైకి మీడియా, థింకిన్ ఈవెంట్స్ నిర్వహించాయి. HBF డైరెక్ట్ లిమిటెడ్, ఎనోర్విజన్ కోస్పాన్సర్స్‌గా వ్యవహరించారు. ఆలోచనాపరులైన నాయకులు, విధాన నిర్ణేతలు, CXOలు, CISOలు, వ్యవస్థాపకులు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ నివారణ, డేటా గోప్యత, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్(DPDPA) వంటి కీలక అంశాలపై దృష్టిసారించారు. హై-ఇంపాక్ట్ ప్యానెల్ చర్చలు, కీలక సెషన్‌లు జరిగాయి.
వక్తలు.. రియల్ వరల్డ్ ఇన్‌సైట్స్, ఉద్భవిస్తున్న ముప్పులు, నియంత్రణ దృక్పథాలు, దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను భద్రపరచడానికి భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను పంచుకున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో AI-ఆధారిత సైబర్ రక్షణ వ్యూహాలు, సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య సహకారం, సమ్మతి, డేటా రక్షణ గురించి అవగాహన అత్యవసరమని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, ఆవిష్కరణ-ఆధారిత సంస్కృతి, చురుకైన ప్రభుత్వ మద్దతు కారణంగా దీన్ని లాంచ్ సిటీగా ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చినట్లు చెప్పారు. సైబర్‌కాన్ ఇండియాను దేశవ్యాప్తంగా అనేక నగరాలకు తీసుకెళ్లాలని, AI, సైబర్ సెక్యూరిటీ చర్చల కోసం దేశవ్యాప్త వేదికను నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని టి-హబ్‌లో విజయవంతంగా ప్రారంభించడం వల్ల టెక్నాలజీ, ఆవిష్కరణ, సైబర్ రెజిలియెన్స్‌కు ప్రముఖ కేంద్రంగా హైదరాబాద్ స్థానం బలపడుతున్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. సైబర్‌కాన్ ఇండియా దేశంలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక శిఖరాగ్ర సమావేశాల్లో ఒకటిగా మారడానికి వేదికను సిద్ధం చేస్తుందనే అంశమూ అవగతమైంది.
ఈ సమావేశంలో ప్రముఖ వక్తలు పాపరాజు బుద్ధవరపు(మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & CISO, ONGC లిమిటెడ్), యోగానంద్ తాడేపల్లి(CTO, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా), సచిన్ కె షెయోరాన్(CEO & డైరెక్టర్, HBF డైరెక్ట్ లిమిటెడ్), ప్రవీణ్ కుమార్ తంగెల్లా(జాయింట్ సెక్రటరీ, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్), మూహిత్ వర్మ(CEO, ఎనోర్విజన్ AIML లిమిటెడ్), శ్రేయాస్ కులకర్ణి(వ్యవస్థాపకుడు, రిలేషన్స్ AI), మానస్ మోహరానా(డిప్యూటీ CISO, గ్రీన్కో గ్రూప్) పాల్గొన్నారు.
