Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Osmania University | 11 కోర్సుల కోసం ఒప్పందం

Osmania University | 11 కోర్సుల కోసం ఒప్పందం

స్వయం పోర్టల్ (Swayam Portal) వేదికగా 8 కొత్త కోర్సులు సహా 11 కోర్సుల రూపకల్పన కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC) ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా కోర్సుల్లో 50 చొప్పున పాఠ్యాంశాల రూపకల్పన కోసం ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం సమక్షంలో కోర్సు కోఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ ఈఎంఆర్సీ పి.రఘుపతి ఎంఓఏ(MoU)పై సంతకం చేశారు. 2026 జనవరి, 2026 జూలై సెమిస్టర్లలో ఈ కోర్సులు స్వయం పోర్టల్లో అందుబాటులో ఉంటాయి.

ఈ సందర్భంగా ఈఎంఆర్సీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2 ఎడిట్ సూట్లు, పీసీఆర్(PCR)ను రిజిస్ట్రార్ ఆచార్య జి.నరేష్ రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్ కుమార్ నాయక్, యూజీసీ (UGC) వ్యవహారాల డీన్ ఆచార్య లావణ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంఓఎ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్వయం ఆన్ లైన్ కోర్సుల వివరాలు పొందుపరిచిన క్యూఆర్ కోడ్(QR Code)తో కూడిన పోస్టర్లను కోర్సు కోఆర్డినేటర్లతో కలిసి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ.. డిజిటల్ ఎడ్యుకేషన్(Digital Education)లో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఈఎంఆర్సీ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

- Advertisement -

రానున్న కాలంలో విస్తృత ప్రచారం ద్వారా ఓయూ ఈఎమ్మార్సీ నుంచి వందకు మించి కోర్సుల రూపకల్పన జరగాలను ఆకాంక్షించారు. కేవలం కొన్ని ఫ్యాకల్టీలకే పరిమితం కాకుండా ఇంజినీరింగ్, సైన్స్, లా, మేనేజ్ మెంట్, కామర్స్ సహా అన్ని విభాగాల నుంచి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల రూపకల్పన జరగాలని సూచించారు. ఇందుకోసం అధ్యాపకుల్లో విస్తృత అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయా కోర్సులకు సంబంధించిన ప్రోమోలను ఆవిష్కరించి…. శుభాకాంక్షలు తెలిపారు.

నిర్దేశిత సమయంలో యూజీసీ, సీఈసీ కోర్సుల రూపకల్పన పూర్తి చేసిన ఈఎంఆర్సీ బృందాన్ని రిజిస్ట్రార్ ఆచార్య నరేష్ రెడ్డి, ఓఎస్డీ జితెందర్ నాయక్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ లావణ్య, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య కిషన్, జాయింట్ రిజిస్ట్రార్ శ్రీమతి నీరజ లు పాల్గొన్నారు.

2026 సంవత్సరానికి ఈఎంఆర్సీ నుంచి వెలువడుతున్న ఆన్లైన్ కోర్సుల వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం-ప్రొఫెసర్ కాశీం, కూచిపూడి విశారద-శ్రీమతి సూరి శ్రీవల్లి, జియో మార్ఫాలజీ-ప్రొఫెసర్ శ్రీనగేశ్, హ్యూమన్ జాగ్రఫీ-డాక్టర్ విగ్నేశ్వర్ మేక, కౌన్సిలింగ్ ఇన్ సోషల్ వర్క్-డాక్టర్ కనకదుర్గ, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్-డాక్టర్ ఎ.శ్రీధర్ రాజ్, వాటర్ రిసోర్స్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్ మెంట్-డాక్టర్ హరీశ్ గుప్త, ఇండియన్ జాగ్రఫీ-ప్రొఫెసర్ శ్రీనగేష్, క్లైమేట్ ఛేంజ్ వల్నరబిలిటీ అండ్ అడాప్షన్-డాక్టర్ అనుపమ దుబే, ఎకనామిక్ జాగ్రఫీ-డాక్టర్ అనురాధ, ప్రాచీన కాలం నుంచి మధ్యకాలం వరకు కవితా విశ్లేషణ డాక్టర్ రాజశ్రీ లు ఎంఓఏ పై సంతకాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News