Saturday, October 4, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుచంచల్‌గూడా జైలుకు అఘోరీ శ్రీనివాస్‌

చంచల్‌గూడా జైలుకు అఘోరీ శ్రీనివాస్‌

అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్‌ ట్రాన్స్‌ జెండర్‌ కావడంతో చంచల్‌ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్‌ చేసిన అఘోరిని బుధ‌వారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అఘోరీ ప్రస్తుతం చంచల్‌ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం. రిమాండ్‌ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్‌ను ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనను ట్రాన్స్‌ జెండర్‌ ఫీమేల్‌గా గుర్తించారు. దాంతో కంది సబ్‌ జైలు అధికారులు జైలులోకి ప్రవేశానికి నిరాకరించారు. దానితో పోలీసులు శ్రీనివాస్‌ను మరోసారి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదిక ఆధారంగా ఆయనను ఏ జైలుకు తరలించాలన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చంచల్‌ గూడ మహిళా జైలుకు తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News