Monday, October 27, 2025
ePaper
HomeఫోటోలుAfrican king | ఆఫ్రికన్ రాజుకు 15 మంది భార్యలు, 100 మంది సేవకులు మరియు...

African king | ఆఫ్రికన్ రాజుకు 15 మంది భార్యలు, 100 మంది సేవకులు మరియు 30 మంది పిల్లలు

కొద్ది నెలల క్రితం యూఎఈ (United Arab Emirates) పర్యటనలో ఆఫ్రికాకు చెందిన ఎస్వాటినీ (స్వాజీలాండ్) దేశం రాజు మస్వాతి III తన 15మంది భార్యలు, 100మంది సహాయకులతో కలిసి ప్రైవేట్ జెట్‌లో వెళ్లారు. ఆ పర్యటనలో వారి 30 మంది పిల్లలు కూడా ఉన్నారు. మస్వాతీ III అబుదాబి విమానాశ్రయంలో అడుగు పెట్టడంతో అక్కడ హడావిడి మామూలుగా లేదు. రాజు, ఆయన భార్యలు సంప్రదాయ వస్త్రధారణలో విమానం నుంచి దిగిన దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ భారీ పరివారం కారణంగా ఆసమయంలో ఎయిర్ పోర్టులోని పలు టెర్మినళ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. అయితే, అప్పటి వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News