Tuesday, October 28, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుపోలీస్‌స్టేష‌న్‌కు నటి లావణ్య

పోలీస్‌స్టేష‌న్‌కు నటి లావణ్య

  • మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్‌

నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఆర్జే శేఖర్‌ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ ఆమె కంప్లైంట్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆధారాలను సైతం ఆమె పోలీసులకు సమర్పించారు. మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషాకు సంబంధించిన ఆడియోలను పోలీసులకు లావణ్య ఇచ్చారు. తనతోపాటు మరో యువతిని సైతం డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు వారిద్దరూ ప్రయత్నించారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News