Tuesday, March 31, 2026
Homeహైదరాబాద్‌ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ను అడ్డుకుంటారా..?

ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ను అడ్డుకుంటారా..?

  • ఆ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి..
  • డిమాండ్ చేసిన ముదిరాజ్ సమన్వయ కమిటీ..

హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవుల గ్రామంలో మార్చి 28న సిఎం రేవంత్ రెడ్డి హాజరైన ఓంకారేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వరును అడ్డుకొని, దురుసుగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

సోమవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిటీ నేతలు చొప్పరి శంకర్, డా.ఆర్. వినోద్ కుమార్లు మాట్లాడుతూ… ఈ విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రి వాకిటి శ్రీహరి తీసుకెళ్లాలని కోరింది. ముదిరాజ్ లను దూరం పెడితే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతదని హెచ్చరించారు. కోకాపేటలో ఐదు ఎకరాల ముదిరాజ్ భవనంలోని ట్రస్టును రద్దు చేయాలని, ముదిరాజ్ లను బిసి-డి నుంచి బిసి-ఎలోకి మార్చాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఫిషరీష్ కు చైర్మన్ ను నియమించారు కానీ, వైస్ చైర్మన్ పదవిని ముదిరాజ్ లకు ఇవ్వాలన్నారు. నామినేటెడ్ పార్టీ పదవులు, కోకాపేట భూమి వివాదం వంటి సమస్యలు పరిష్కరించాలని వారు సిఎం రేవంత్ రెడ్డిని కోరారు. సిఎ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకొని తమ సమస్యలు పరిష్కరిస్తే విజయోత్సవ సభ నిర్వహిస్తామ ని, లేని పక్షంలో ముదిరాజ్ లంతా యుద్ధభేరి మోగిస్తారని హెచ్చరించారు. సమావేశంలో కమిటీ నేతలు ఉప్పరి నారాయణ, పుట్టి రాజు, చలపతి, వెంకటేశ్, సంతోష్, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News