- 200వ జ్ఞాన మాల కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్
నవ భారత రాజ్య నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దమ్మాయిగూడ డివిజన్ 4 అర్జికే కాలనీలో గల మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 200వ జ్ఞాన మాల కార్యక్రమంలో ఆయన పాల్గొని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ చైతన్యం, హక్కుల పరిరక్షణే అంబేద్కర్ చూపిన ప్రధాన మార్గాలని పేర్కొన్నారు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన అంబేద్కర్ జయంతిని జరుపుకున్నట్టవుతుందని తెలిపారు. అనంతరం మాజీ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం అందరం కలిసి ముందుకు తీసుకుపోదాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు గోగుల సరిత,మేడ్చల్ మార్కెట్ కమిటి చైర్మన్ నర్సింహులు యాదవ్, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పా రామారావు, మార్కెట్ కమిటి డైరెక్టర్ ఈగ శ్వేత రాజు, కీసర గుట్ట ట్రస్టు బోర్డు సభ్యులు ప్రసాద్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లు నాను నాయక్, మంగళపురి వెంకటేష్ , భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, పాండాల యాదగిరి గౌడ్, సంజీవరెడ్డి, జాతీయ మాల మహానాడు సంఘం మేడ్చల్ జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం, అర్జికే మాల సంఘం అధ్యక్షుడు యాటా రాజు, ప్రధాన కార్యదర్శి సానాది సాయి బాబా, పెద్దలు అబ్బులు, రాజేంద్ర ప్రసాద్, రూప చంద్రమౌళి, కీసర అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కర్ర గణేష్, అర్జికే కాలనీ కమిటీ అధ్యక్షుడు రాములు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఈగ రాజు, మాల సంఘం సభ్యులు, కాలనీ పెద్దలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
