Thursday, February 12, 2026
Homeక్రైమ్ వార్తలుAccident | విజయవాడ హైవేపై ప్రమాదం

Accident | విజయవాడ హైవేపై ప్రమాదం

ఇద్దరి దుర్మరణం.. 20 మందికి గాయాలు

విజయవాడ-హైదరాబాద్ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్, ఒక ప్యాసింజర్ చనిపోయారు. నిలిపి ఉంచిన లారీని ట్రావెల్స్ బస్ ఢీకొట్టడంతో 20 మంది గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైంది. గాయపడినవారిని చౌటుప్పల్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రమాదం వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు బుక్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News