Wednesday, February 11, 2026
Homeక్రైమ్ వార్తలుAcb Net | ఏసీబీ వలలో ఇద్దరు ఆఫీసర్లు

Acb Net | ఏసీబీ వలలో ఇద్దరు ఆఫీసర్లు

నిందితులు భీమన్న, శుభకామేశ్వరి
ఒకరు బాసర పీహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్
మరొకరు కారేపల్లి తహశీల్దార్ ఆఫీసులో ఆర్ఐ

అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) అధికారుల వలలో ఒకే రోజు ఇద్దరు ఆఫీసర్లు చిక్కారు. ఇందులో ఒకరు జి.భీమన్న కాగా మరొకరు.. ఉసా శుభకామేశ్వరి. భీమన్న.. నిర్మల్ జిల్లా బాసర పీహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్(Senior Assistant). శుభకామేశ్వరి.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(Revenue Inspector). జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎఫ్‌టీఏ బిల్లలు మంజూరు చేసేందుకు డబ్బు డిమాండ్ చేసి రూ.9 వేలను ఫోన్ పే ద్వారా తీసుకుంటూ భైంసా ఎన్‌బీ నగర్‌లోని తన ఇంట్లో ఆదిలాబాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

- Advertisement -

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (Family Member Certificate) వెరిఫికేషన్, అటెస్టేషన్, ఫార్వార్డ్ చేసేందుకు లంచం (Bribe Case) డిమాండ్ చేసి కారేపల్లిలోని తన ఇంట్లో రూ.10 వేలు తీసుకుంటూ దొరికారు. ఏసీబీ అధికారులు ఘటనా స్థలంలో రూ.10 నగదు స్వాధీనం చేసుకున్నారు. భీమన్నను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. శుభకామేశ్వరిని అదుపులోకి తీసుకొని వరంగల్‌లోని ఏసీబీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. రెండు కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News