Friday, October 3, 2025
ePaper
Homeస్పోర్ట్స్Abhishek Sharma | ఐసీసీ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్‌ శర్మ

Abhishek Sharma | ఐసీసీ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్‌ శర్మ

907 రేటింగ్‌ పాయింట్లతో అభిషేక్‌ టాప్‌ ప్లేస్‌లో

ఆసియా కప్‌లో రాణిస్తున్న టీమ్‌ఇండియా యంగ్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ తాజా ఐసీసీ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. 907 రేటింగ్‌ పాయింట్లతో అభిషేక్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. అతడి తర్వాత ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌ (844 రేటింగ్స్‌) రెండో ప్లేస్‌లో ఉన్నాడు . ఇక టీమ్‌ఇండియా మరో యంగ్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. 791 రేటింగ్స్‌తో ప్రస్తుతం తిలక్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌ సూర్యకమార్‌ కూడా (729 రేటింగ్స్‌) ఒక స్థానం మెరుగుపర్చుకొని ఆరో ప్లేస్‌ దక్కించుకున్నాడు. ఇలా టాప్‌ -10లో ముగ్గురు టీమ్‌ఇండియా ప్లేయర్లు ఉన్నారు. 25ఏళ్ల అభిషేక్‌ గతేడాదే అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి 21 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌ 197.21 స్ట్రైక్‌ రేట్‌తో 708 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌తో అభిషేక్‌ అరుదైన రికార్డ్‌ సాధించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్‌ పాయింట్లు సాధించిన భారత మూడో బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అభిషేక్‌ కంటే ముందు సూర్యకుమార్‌ యాదవ్‌ 912, విరాట్‌ కోహ్లీ (909 ఆల్‌టైమ్‌ బెస్ట్‌) ఉన్నారు.

భారత్‌ వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటను వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం టీ20 జట్టులో ఉన్న అభిషేక్‌, ఈ పర్యటనతో వన్డేల్లోనూ అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అతడి పేరను వన్డే సిరీస్‌కు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే మరో యంగ్‌ బ్యాటర్‌ యశస్వీ జైస్వాల్‌ గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్‌ లేజు. కానీ అభిషేక్‌ను ఎంపిక చేస్తారని మాత్రం తెలుస్తోంది. మరోవైవు బౌలింగ్‌ విభాగంలో పాకిస్థాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో రాణిస్తున్న అబ్రార్‌ ర్యాంక్‌లో భారీ మార్పు వచ్చింది. అతడు 12 స్థానాలు మెరుగుపర్చుకొని టాప్‌ 5లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం 703 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (660 రేటింగ్స్‌) ఆరు స్థానాలు మెరుగుపడి టాప్‌ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు 9వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఈ లిస్ట్‌లో భారత్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (747 రేటింగ్స్‌)తో టాప్‌లో ఉన్నాడు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News