Wednesday, February 11, 2026
Homeస్పోర్ట్స్Injury | ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ..

Injury | ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ..

  • నమీబియాతో జరిగే మ్యాచ్ లో ఆడటం కష్టమే..
  • స్టార్ బ్యాట్స్ మేన్ లేకుండానే మ్యాచ్..
  • ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శర్మ..

ఇండియ‌న్ ఓపెనింగ్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆస్ప‌త్రి పాల‌య్యారు. క‌డుపు ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల అత‌న్ని ఆస్ప‌త్రిలో చేర్పించారు. దీంతో అత‌ను టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో న‌మీబియాతో జ‌రిగే మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా ఉన్న‌ది. గ్రూప్ స్టేజ్‌లో గురువారం న‌మీబియాతో మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే అమెరికాతో మ్యాచ్ జ‌ర‌గ‌డానికి ముందు కూడా అత‌ని ఆరోగ్యం స‌రిగా లేద‌ని తెలిసింది. మ్యాచ్ ఆడిన త‌ర్వాత అభిషేక్ ఆరోగ్యం క్షీణించిన‌ట్లు తెలిసింది. అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌తో అత‌ను బాధ‌ప‌డ్డాడు. అమెరికాతో మ్యాచ్ ముందు అత‌నికి రిలీఫ్ మెడిసిన్ ఇచ్చారు.

తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్‌కు అత‌ను హాజ‌రుకాలేదు. అభిషేక్‌కు ఇంకా కొన్ని ఉద‌ర స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, మ‌రో రెండు రోజుల్లో అత‌ను అందుబాటులోకి వ‌స్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొస్కెట్ తెలిపారు. అమెరికాతో మ్యాచ్‌లో అభిషేక్ డ‌కౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత అత‌ను ఫీల్డింగ్ చేసేందుకు క్రీజ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ ఫీల్డింగ్ చేశాడు. ప్ర‌స్తుతం ఢిల్లీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యేది తెలియ‌ద‌ని, అత‌ను న‌మీబియాతో మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా ఉన్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News