అబ్దుల్లాపూర్ గ్రామంలోనీ మెట్టు హిల్స్ కాలనీలో మంగళవారం 4 లక్షల రూపాయల ఐఆర్‌జిఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. రెండు రోజుల్లో వేరు వేరు చోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేషారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ విజయ శ్రీ శైలం గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు దశలవారిగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంతటి సుష్మా అశోక్ గౌడ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మాచగోని మహేందర్ ముదిరాజ్, జీవన్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, శివకుమార్, దశరథ, రఘు యాదవ్, దర్శనం యాదయ్య, బండి సునీత, శ్రీలత, దీపిక నాగరాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి తుల్జా ప్రసాద్, బిల్ కలెక్టర్ సురేందర్ పాల్, మెట్టు హిల్స్ కాలనీ వాసులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
- Advertisement -
