Wednesday, February 11, 2026
HomeసినిమాSatvika | ‘ఆకాశంలో ఒక తార’ లాంటి కథానాయిక

Satvika | ‘ఆకాశంలో ఒక తార’ లాంటి కథానాయిక

దుల్క‌ర్ స‌ల్మాన్(Dulquer Salmaan) చేస్తున్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార‌’(Aakasamlo Oka Tara). ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని(Director Pawan Sadhineni) తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్(Geetha Arts), స్వ‌ప్న సినిమా(Swapna Cinema) స‌మ‌ర్ప‌ణ‌లో లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్‌పై సందీప్ గున్నం, ర‌మ్య గున్నం నిర్మిస్తున్నారు. సాత్విక హీరోయిన్‌గా ప‌రిచ‌యమవుతోంది. ఆమె క్యారెక్టర్ టీజర్‌ను మేకర్స్ సోమ‌వారం విడుద‌ల చేశారు. మారుమూల ప‌ల్లె నుంచి వ‌చ్చిన ఓ అమ్మాయి ఆకాశంలో తార‌ల‌ను చేరుకోవాలంటూ క‌నే క‌ల‌లను క‌థ‌గా చూపించారు. జీవీ ప్ర‌కాష్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ స‌మ‌కూర్చారు. ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది. స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్‌కు స‌న్నద్ధ‌మ‌వుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News