వేల ఖర్చుతో తెరకెక్కే బొమ్మపై పాలధార పోస్తావు. భక్తితో కొలుస్తావు. తల్లిదండ్రుల కళ్లలో ప్రేమను చూడవు. వారి కష్టం విలువ అసలే తెలియదు! మొదటి రోజు, మొదటి షోల హడావుడి, కనుమూసి చూసే కన్నీళ్లు ఎన్నెన్నో! వీధిలో అన్యాయం, కళ్లెదుట మోసం ఎందుకని నీ గొంతు మూగబోతోంది? ప్రశ్నించే ధైర్యం ఎక్కడ దాచావు యువతా? నా పని, నా డబ్బు, నా సుఖం, నా లోకం ఈ స్వార్ధపు తెర వెనుక ఎంత కాలం? నా కులం, నా మతం అంటూ కంచెలు కడతావు, మానవత్వం అన్న మాటను మర్చిపోతావు! చేతిలో శక్తి ఉంది, మెదడులో తెలివుంది మంచి చేయాలన్న సంకల్పం ఏమైంది?
– సౌరం జితేందర్