పూటకో పార్టీ, పూటకో నినాదం.. దళిత యువతను ఎగదోసి, మెట్లెక్కావు.. గద్దెనెక్కావు. ఇప్పుడు మళ్లీ వచ్చావు.. ఈసారి బీసీల పేరుతో నీ స్వార్థానికి మా జీవితాలు బలి కావాలా? నీ ఆటలకు మా భవిష్యత్తులు తాకట్టు పెట్టాలా? మోసం నా నైజం, వెన్నుపోటు నా ఆయుధం అని నీవు అనుకుంటున్నావేమో! కానీ, ఈసారి అలా కాదు. తెలంగాణ యువత తెలివైనది.. చదువుకున్నది, స్పృహ ఉన్నది.. నీ రంగుల మాటలు నమ్మరు.. నీ తప్పుడు వాగ్దానాలు వినరు.. నీ పాత నాటకాలు, నీ కొత్త అవతారాలు.. ఇక చెల్లవు, సాగవు! నువ్వు చేసే మోసాలు, కుట్రలు ఇకపై సాగనివ్వం.. నీ స్వార్థానికి మేము లొంగం.. నీ మోసానికి మేము భయపడం.. ఈసారి నిన్ను అడ్డుకునేది మేము! నీ పాత ఆటలు ఇక చెల్లవు… తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ యువతా! అతడు మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడు.. మన ఐక్యతే అతడికి జవాబు..
- సౌరం జితేందర్
