రిజర్వేషన్ల పంపిణీతో పీఠమునధిష్ఠింపగనే సరిపోవునా? అది ప్రజల జీవనమును మార్చు మంత్రమనుట కేవలము భ్రమే కదా! కొందరు ఆ ఉన్నత స్థానములపై ఆసీనులగుదురేమో గాని.. నిరుపేదవాని ఆకలి మంట చల్లారదు.. సామాన్యుని ఆదాయము వృద్ధి చెందదు. అధికారము హస్తగతము కాగానే.. ప్రజా శ్రేయస్సునే విస్మరించిరి.. స్వప్రయోజనములకే ప్రాధాన్యమిడుచు.. ప్రజాహితమును పక్కకు నెట్టిరి.. గత చరిత్ర పుటలను తిలకించినచో, ఉన్నత శిఖరములను చేరినవారే.. తమ మూలములను, తమ వర్గములను మరచిన ఉదంతములెన్నో కనబడును.. లోపమంతయు విధానములందు లేదు.. నాయకత్వపు నైతికతయందే ఉన్నది.. సేవాభావమే కొరవడినది.. పదవులకై పాకులాటయే పెరిగినది.. కులమేది? మతమేది? అను ఈ వ్యర్థ ప్రసంగము మనకు వలదు.. దేశభక్తి, ప్రజానురక్తి కలిగి సేవకై అంకితమైన ధీరుడు… ఏ వర్గము వాడైననేమి? అతడే మన నేత! అటువంటి నాయకుడు దొరికిననాడే మన జీవన మార్గము సుగమమగును..
- Advertisment -
