మన దేశంలో, రాష్ట్రాల్లో చట్ట సభ సభ్యులు ఖాళీ అయితే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారు.. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం నిర్లక్ష్యంతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రెండేళ్లకు పైగా ఎన్నికలు లేకపోవడం ప్రజాస్వామ్యానికి గోడ్డలి పెట్టు కాదా! స్థానిక సంస్థలు బలపడితేనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. ప్రజాస్వామ్యానికి పునాదైన ఈ సంస్థలను బలహీనపరచడంతో దేశం వెనుకబడదా!. “గ్రామ స్వరాజ్యం దేశ బలం’ అన్న గాంధీ మాటల ప్రాముఖ్యతను గుర్తించారా? దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు చట్టసభల మాదిరిగానే సకాలంలో నిర్వహించాలి. ఇది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు. ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?
మేదాజీ
