ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు సేవకులైనప్పుడు, ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్నప్పుడు.. సామాన్యుడు తమ సమస్యలను ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, తమ కార్యాలయాల్లో సామాన్యుడితో ఎలా ప్రవర్తిస్తున్నాడో సమాజానికి తెలియాలంటే, సామాన్యుడి కోసం కొన్ని మార్పులను రాజ్యాంగంలో, చట్టంలో చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.. అదే వీడియో రికార్డింగ్ అని ఆయుధం సామాన్యుడికి హక్కు కావాలి. పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సంభాషణ వీడియో తీసుకునే వెసులుబాటు న్యాయస్థానం సామాన్యుడికి కల్పించాలి.. అప్పుడు కదా రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల అసలు బండారం బయటపడేది..
- కుమ్మరి రాజు