రక్షణ కల్పించే వారికీ రక్షణ లేనిచోట మనం
ఉన్నాము ఇప్పుడు. హర్యానా అదనపు డిజిపి పూరన్
కుమార్ ఐపిఎస్ ఆత్మహత్య అత్యంత బాధాకరం.
సూసైడ్ నోట్ లో అయన రాసిన ప్రతి అంశంపైన
వ్యక్తి, వ్యక్తుల పైన విచారణ చేపట్టాలి. ఇందులో కుల
వివక్ష అనేది ప్రధానమైంది. చదువు ద్వారా
కులవివక్షను రూపుమాపవచ్చు అనేది వట్టి
మాటనేనా..! ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా
కులవివక్ష ఎదురుకున్నాడు అంటేనే చాలా
బాధేస్తుంది. అంగరకుడిపైన, చంద్రమండలంపైన
అడుగులు ఎస్తున్న మనం, గీ కులవివక్షను
రూపమాపలేకపోతున్నాం.. ముమ్మాటికీ ఇది మన
మూర్ఖత్వం. ఇంకా రిజర్వేషన్స్ ఎందుకు అనే వారిని
కూడా ఇది మేల్కొల్పుతుంది నేడు. మూర్ఖులు
ఉన్నంతవరకు సత్పురుషులు ఇలా ప్రాణత్యాగాలు
చేస్తూనే ఉంటున్నారు.. ఇప్పటికీ ఇలా.. మారడు
మూర్ఖుడు మారడు. మారడు మూర్ఖుడు మారడు..
- సుధాకర్ తలారి
