వేమూరి కావేరి ట్రావెల్స్ (Vemuri Kaveri) బస్సు దుర్ఘటన (Kurnool Bus Accident) మరో తీవ్రమైన మానవ నష్టం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లాల్సిన ప్రయాణం ఎన్నో కుటుంబాలను శోకసముద్రంలో ముంచింది. ఒక్క క్షణంలో 19 ప్రాణాలు గాల్లో కలిశాయి. గతంలో మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఘటనలో 45 మంది సజీవ దహనం (Burning alive) మర్చిపోలేం. ప్రతి విషాదం తర్వాత కొద్ది రోజుల హడావుడి, ఆపై మళ్లీ నిర్లక్ష్యమే? బస్సుల భద్రత పర్యవేక్షణ నిరంతరం కఠినంగా జరగాలి. ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి మన్నికగా తనిఖీలు (Checking) చేయాలి. ఈ విషయంలో ఉదాసీనత వద్దు. నియమాల(Rules)ను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు (Strict Action) తీసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల లాభం లేదు. ప్రయాణికుల భద్రతే పాలకుల బాధ్యత.
- మేదాజీ
